రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమార్ మృతి

967చూసినవారు
రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమార్ మృతి
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమార్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయన ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో అధ్యాపకునిగా, ప్రిన్సిపల్ గా సేవలందించారు. ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి, ఆ శాఖ సెక్రటరీకి ఓఎన్డీగా నియమించింది. కోదాడ కేఆర్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ మృతి పట్ల ఆయన మిత్రులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్