కోదాడలో జరిగిన శాఖా పోస్టుమాస్టర్లు, సహాయ శాఖా పోస్టుమాస్టర్ల సమీక్షా సమావేశంలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డి. ఎస్. వి. ఆర్. మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పోస్టల్ సేవల విస్తరణ, పనితీరు మెరుగుదల, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, వ్యాపారాభివృద్ధి, డిజిటల్ సేవల ప్రోత్సాహంపై అధికారులు సుమారు 150 మంది సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. సూర్యాపేట డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ నరహరి, హుజూర్‌నగర్ సబ్‌డివిజన్ ఇన్‌స్పెక్టర్ సురేష్, కోదాడ ఉప పోస్టుమాస్టర్ కుమార్ కూడా హాజరయ్యారు.