కేక పుట్టించిన రిషి డ్యాన్స్ అకాడమీ చిన్నారుల ప్రదర్శనలు

465చూసినవారు
కేక పుట్టించిన రిషి డ్యాన్స్ అకాడమీ చిన్నారుల ప్రదర్శనలు
కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో తెర సాంస్కృతిక కళా మండలి 33వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కోదాడ రిషి డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలకు ప్రముఖులు మట్టి మనుషుల విచ్చు గొంతుక, పాటల పుట్ట ఈ కాలపు వేమన చింతల యాదగిరి, స్వర దీప స్వరాల సృష్టి కర్త రాగాల రారాజు సంగీత దర్శకుడు భీమ్స్ సిసి రోలియో, నటుడు జెమినీ సురేష్ లు హాజరై, చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. తెర వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు, డ్యాన్స్ మాస్టర్ ప్రేరిణి నాగేశ్వరరావును మెమెంటో అందజేసి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్