సూర్యాపేట జిల్లా 2024 బకాయిల సాధన సమితి అధ్యక్షుడు పొనుగోటి కోటయ్య ప్రభుత్వం పెన్షనర్లపై అబద్ధపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, 2024 మార్చి నుంచి రిటైరైన వారికి రూ. 1000 కోట్లు విడుదల చేశామన్న ప్రకటన తప్పుదోవ పట్టించేదని అన్నారు. జీపీఎఫ్, పీఆర్సీ, జీఐఎస్, టీఎస్జీఎల్ఐ బకాయిల చెల్లింపులపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రూ. 1000 కోట్లు ఎవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బావసింగ్, నాగేశ్వరరావు, రమేష్ బాబు, బిక్షం, మణిరాం, జాఫర్ పాల్గొన్నారు.