కోదాడలో పాఠశాల వాహనాలపై ఆర్టీఓ తనిఖీలు

5చూసినవారు
కోదాడలో పాఠశాల వాహనాలపై ఆర్టీఓ తనిఖీలు
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో బుధవారం ఆర్టీఓ అధికారులు పాఠశాల విద్యార్థులను తరలించే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోలను గుర్తించి, ఫిట్‌నెస్, పర్మిట్, బీమా పత్రాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఒక ఆటోలో ఐదుగురికి మించి విద్యార్థులను పంపొద్దని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.