కోదాడ టౌన్‌లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ముందస్తు సంబరాలు ఘనంగా జరిగాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులు తెలంగాణ, హర్యానా సంప్రదాయ వేషధారణలో పండుగ శోభను ఆవిష్కరించారు. గంగిరెద్దు, హరిదాసు వేషాలు, పిండి వంటలు, భోగిమంటలు, రంగవల్లి ముగ్గులు, పతంగులతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. సంక్రాంతి పాటలతో నృత్య ప్రదర్శనలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఈ. శ్రీనివాసరెడ్డి, కార్యక్రమ నిర్వాహకురాలు పద్మావతి పాల్గొన్నారు.