సూర్యాపేటలో సంక్రాంతి ముగ్గుల పోటీలు: జనాలకు కనుల విందు

251చూసినవారు
సూర్యాపేటలో ఆదివారం ఉదయం సద్దలచెరువు వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు, నల్గొండ జిల్లా వైస్ చైర్ పర్సన్ ఒట్టే జానయ్య యాదవ్ ఈ పోటీలను నిర్వహించారు. సూర్యాపేట ప్రజలతో పాటు ఖమ్మం, కోదాడు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ పోటీలను తిలకించారు. పలువురు మహిళలు, కాలేజీ అమ్మాయిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సంఘాల అధ్యక్షురాలు కవిత శోభతో పాటు అనేకమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్