నర్సింహులగూడెం గ్రామంలో 12 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ సర్పంచ్ కుంచం ఇందిరా నరసయ్య చొరవతో, జిల్లా కలెక్టర్ అనుమతితో పాఠశాల పునఃప్రారంభమైంది. మండల విద్యాధికారి పీడతల వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుడిని నియమించి పాఠశాలను ప్రారంభించారు. తొలి రోజే 30 మంది
విద్యార్థులు చేరారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠశాల తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.