సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3నుండి జరిగే
నీట్ పరీక్షా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12గంటల నుండి రాత్రి 7గంటల వరకు సెక్షన్ 163బీఏన్ఎస్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200మీటర్ల దూరం వరకు 5గురికి మించి గుంపులుగా ఉండరాదని, ఈ సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.