మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో శుక్రవారం, పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులకు అల్పాహారం, అరటి పండ్లు పంపిణీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సేకు మురళీకృష్ణ, లక్ష్మీ సునంద దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పందిరి ఫౌండేషన్ గౌరవ సలహాదారు, ఎంఎస్ విద్యాసంస్థల సీఈఓ సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ, వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవడం ఆదర్శనీయమని పేర్కొంటూ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.