ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత ఇవ్వాలీ

190చూసినవారు
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత ఇవ్వాలీ
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బరపటి కోటేశ్వరరావు కోరారు. శనివారం కోదాడలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మరిన్ని ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని, క్షేత్రస్థాయిలో అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఎమ్మెల్యేను కోరారు.

సంబంధిత పోస్ట్