శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రారంభం

517చూసినవారు
శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రారంభం
కోదాడ పట్టణంలో శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థను మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోదాడ వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణమని, ఇక్కడ నాణ్యమైన సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. వినియోగదారుల విశ్వాసం పొందితే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, యజమానులు ప్రత్యేక రాయితీలతో వస్తువులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వంగవీటి రామారావు, దేవరపల్లి మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :