సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామా నరసింహరావు, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు గోల్ తండా నాగరాజు తండ్రి బానోత్ సోమ్లా నాయక్ అనారోగ్యంతో మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోమ్లా నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగరాజు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావడంలో కుటుంబం చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని, వారికి ధైర్యం చెప్పి, సోమ్లా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.