అభయ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు

794చూసినవారు
అభయ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు
కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తొలి మంగళవారం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మహిళా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాదాత ఓరుగంటి స్వర్ణలత జ్ఞాపకార్థం ఓరుగంటి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు, కె. వి. లక్ష్మారెడ్డి–పద్మ దంపతులు, ఇతర దాతల సహకారంతో అన్నదానం చేపట్టారు. అనంతరం దాతలను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జూకూరి అంజయ్యతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్