కోదాడలో శ్రీ అభయాంజనేయ స్వామి అన్నప్రసాద వితరణ

0చూసినవారు
కోదాడలో శ్రీ అభయాంజనేయ స్వామి అన్నప్రసాద వితరణ
సూర్యాపేట జిల్లా, కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం 174వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కీ.శే. దేవరశెట్టి క్రిష్ణయ్య, శాయమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు దేవరశెట్టి హనుమంతరావు ఉమారాణి, నెలవారీ చందాదారులు దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సుమారు 310 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య, వి.కృష్ణమూర్తి, సెక్రటరీ తిరుపతయ్య, నాగరాజు, శిరీష, బ్యాటరీ చారి, ఉమామహేశ్వరరావు, పెద్ది శేషు, ఆకుల పుల్లారావు, విశాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్