అనంతగిరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి నియామకం

12చూసినవారు
అనంతగిరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి నియామకం
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముసుకు శ్రీనివాస్ రెడ్డి గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజలకు చేరువయ్యేలా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.