నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలీ.. ఎమ్మెల్యే

0చూసినవారు
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలీ.. ఎమ్మెల్యే
కోదాడ నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ తెలిపారు. సోమవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులో మంచినీటి ట్యాంకును ప్రారంభించిన ఆమె, వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రతి వార్డుకు నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్ తోట శ్రీను, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్