
శాంతి ఒప్పందం.. దిగొచ్చిన ముడిచమురు ధరలు
శాంతి ఒప్పందానికి ఇరాన్, అమెరికా దేశాలు అంగీకరించడంతో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు 88 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 93 డాలర్లకు పడిపోయింది. ఇది బ్యారెల్కు 18 శాతం తగ్గుదల. 60 రోజుల కాల్పుల విరమణ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు, హార్ముజ్ జలసంధిని తెరవడం వంటి అంశాలపై ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చాయి.




