
ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్.. వీడియో
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా గోరఖి గ్రామానికి చెందిన డాక్టర్ గణేశ్ బరైయా, కేవలం మూడు అడుగుల ఎత్తు ఉన్నప్పటికీ, ప్రభుత్వ వైద్యాధికారిగా తన కలను నెరవేర్చుకున్నారు. గ్రోత్ హార్మోన్ లోపం కారణంగా ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ నిరాకరించినా, న్యాయపోరాటం చేసి, సుప్రీంకోర్టులో గెలిచి 2019లో సీటు పొందారు. నేడు బాండెడ్ మెడికల్ ఆఫీసర్‌గా ప్రజలకు సేవ చేస్తూ, లక్ష్య సాధనలో దృఢ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నారు.




