కోదాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం రైతులకు 50 శాతం రాయితీతో జీలుగు విత్తనాల పంపిణీని పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. జీలుగు పంట భూసారాన్ని పెంచడంతో పాటు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విత్తనాలు పొందడానికి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ ప్రతులు సమర్పించాలని తెలిపారు. వర్షాలు కురిసి భూమిలో తగిన తేమ ఏర్పడిన తర్వాతే విత్తనాలు చల్లితే మంచి
ఫలితాలు వస్తాయని వివరించారు.