సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో, నేరేడుచర్లకు చెందిన నరేష్ పెంచుకుంటున్న రెండు నెలల గర్భంతో ఉన్న బ్లాక్ బెంగాల్ జాతి మేకకు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య ఆధ్వర్యంలో, గర్భంలోని పిల్లకు ఎలాంటి ప్రమాదం కలగకుండా, స్థానిక మత్తుతో మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేసి, ఎముకకు ప్లేట్, రాడ్ అమర్చి విజయవంతంగా సరిచేశారు. ఈ చికిత్సలో డా. సిరిపురపు సురేంద్ర, సిబ్బంది శివ, చంద్రకళ, సాగర్ పాల్గొన్నారు.