సూడి గేదె కు శస్త్ర చికిత్స... 100 లీటర్ల ఉమ్మనీరు తీసివేత

5చూసినవారు
సూడి గేదె కు శస్త్ర చికిత్స... 100 లీటర్ల ఉమ్మనీరు తీసివేత
కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణీ గేదె అనారోగ్యానికి గురైంది. పొట్ట ఉబ్బి, మేత మేయకపోవడంతో స్థానిక చికిత్సలు విఫలమయ్యాయి. దీంతో, గేదెను కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించారు. అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్సలో, దూడ స్థానంలో సుమారు 100 లీటర్లకు పైగా ఉమ్మనీరు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉమ్మనీటిని తొలగించి, గేదె అరల పొట్టను సరిచేసి, శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పిండం ఎదుగుదల లోపం వల్ల ఏర్పడే అరుదైన కేసు అని వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్