గాయపడ్డ గేదెకు శస్త్ర చికిత్స

1చూసినవారు
గాయపడ్డ గేదెకు శస్త్ర చికిత్స
కోదాడ పట్టణంలో షేక్ నబీకి చెందిన పెంపుడు గేదెలు ఖమ్మం రోడ్డుపై లారీ ఢీకొని మృతి చెందాయి. లక్ష రూపాయల విలువైన ఒక గేదె అక్కడికక్కడే మరణించగా, మరో గేదెకు కాలు, కొమ్ము విరిగాయి. గాయపడిన గేదెను కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించగా, అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య శస్త్రచికిత్స చేసి చికిత్స అందించారు. పశువులను రోడ్లపై వదిలేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు, పశువుల భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్