స్వర్ణభారతి చారిటబుల్ సేవలు ప్రశంసనీయం

3చూసినవారు
కోదాడ పట్టణం 34వ వార్డులో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుర్రి సీతారాములు 10వ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు శిబిరాన్ని ప్రారంభించి, పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ట్రస్ట్ సేవలను అభినందించారు. ఈ శిబిరంలో సుమారు 400 మందికి షుగర్, బీపీ, ఈసీజీ, రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లీశ్వరి, బాలేంద్ర, పాండు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్