ఎస్‌డబ్ల్యూసీ గోదాం తనిఖీ

0చూసినవారు
ఎస్‌డబ్ల్యూసీ గోదాం తనిఖీ
కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఎస్‌డబ్ల్యూసీ గోదాంను బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, స్టాక్ రికార్డులను పరిశీలించి నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు చేయించారు. పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యం నాణ్యతలో రాజీ పడకుండా జాగ్రత్తగా నిల్వ చేయాలని, ఎఫ్‌ఐఎఫ్ఓ విధానం పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ఆరు బఫర్ గోదాంలలో పనిచేస్తున్న హమాలీలందరికీ లేబర్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, సివిల్ సప్లైస్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్