మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో సయ్యద్ బాబ జన్మదిన వేడుకలు

8చూసినవారు
మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో సయ్యద్ బాబ జన్మదిన వేడుకలు
కోదాడ పట్టణంలోని 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ బాబా తన జన్మదిన వేడుకలను బుధవారం అశోక్‌నగర్‌లోని శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో పిల్లల మధ్య జరుపుకున్నారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జన్మదినాన్ని అనాథలు, దివ్యాంగుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని, వేడుకల కోసం ఖర్చు చేసే డబ్బును పేదలకు సహాయంగా వినియోగించాలని ఆయన కోరారు. ఆశ్రమానికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్