తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉప్ప గండ్ల శ్రీనివాసరావు, శుక్రవారం కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, గుళ్ళపల్లి సురేష్, పాలూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.