గడప గడప కు బడి బాట లో ఉపాధ్యాయులు

0చూసినవారు
గడప గడప కు బడి బాట లో ఉపాధ్యాయులు
మోతె మండలం ఊర్లకొండ కాంప్లెక్స్ పరిధిలోని అన్నారుగూడెం, కరక్కాయల గూడెం, ఉర్లుగొండ, తుమ్మగూడెం, నేరేడవాయి, గోపతండా తదితర పాఠశాలల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలతో గడపగడపకు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేశారు. పలు గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్