ఖానాపురం లో బడి పాటకు కదం తొక్కిన ఉపాధ్యాయులు

2చూసినవారు
ఖానాపురం లో బడి పాటకు కదం తొక్కిన ఉపాధ్యాయులు
అనంతగిరి మండలం ఖానాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గడపగడపకు తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. పాఠశాల హెచ్ఎం సుశర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ తోపాటు మరెన్నో సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సహా ఉపాధ్యాయులు, శౌరి, జహీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్