తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చీమ శీనివాస్ పిలుపు మేరకు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు కోదాడ నుంచి కొడంగల్‌కు బయలుదేరారు. ఉద్యమకారుల హామీల అమలుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేకే కమిటీని నియమించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. చేవెళ్ల నుంచి కొడంగల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. హామీల అమలుపై కమిటీ త్వరగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని గుండెపంగు రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల ఏలేశ్వరావు, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, ధరావత్ సైదులు, బొమ్మకంటి వీరబాబు, దుగ్యబోయిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.