కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్ చారి, శనివారం భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా, అంగుళం సుద్ధ ముక్కపై ఆమె ప్రతిమను చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో బియ్యం, పప్పు, చింత గింజలు, పెన్సిల్ మొనలపై సూక్ష్మ కళాఖండాలు చెక్కి నరేష్ చారి ప్రశంసలు అందుకున్నాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని పలువురు అభినందించారు.