ఈహెచ్ఎస్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి.. బడుగుల

0చూసినవారు
ఈహెచ్ఎస్ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి.. బడుగుల
ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)కు సంబంధించిన విధివిధానాలు, ఆసుపత్రులతో ఒప్పందాలు, ప్యాకేజీ రేట్లు, డిజిటల్ హెల్త్ కార్డులు ఖరారు కాకముందే మే నెల వేతనాల్లో 1.5 శాతం చందా కోత విధించడం అభ్యంతరకరమని టీపిటీఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు బడుగుల సైదులు విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్లలో ఉన్న సందేహాలను నివృత్తి చేసి పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలని, అప్పటి వరకు కోతలను నిలిపివేయాలని సీఎం, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్