కోదాడ పట్టణ గాంధీనగర్‌లో MRPS ఆధ్వర్యంలో కర్ల రాజేష్ సంతాప సభ జరిగింది. ఏపురి రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ల రాజేష్ అమాయకుడని, అక్రమ నిర్బంధంలో చిత్రహింసల వల్లే మృతి చెందాడని మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగుతుందని, ఈ నెల 17న సూర్యాపేటలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.