పథకాలు జాప్యం చేయకుండా పేదలకు అందించడమే లక్ష్యం

0చూసినవారు
పథకాలు జాప్యం చేయకుండా పేదలకు అందించడమే లక్ష్యం
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలు జాప్యం చేయకుండా పేదలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శనివారం కోదాడ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్య నారాయణ, గ్రంధాలయ చైర్మన్ రామారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్