కోదాడ మండలం చిమిర్యాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సమగ్ర ఎరువుల యాజమాన్యంపై శిక్షణ ఇచ్చారు. కేవీకే శాస్త్రవేత్త కిరణ్ మాట్లాడుతూ యూరియా వాడకం తగ్గించి, మట్టి ఆరోగ్యాన్ని కాపాడాలని, పంట మార్పిడితో చీడపీడలను నియంత్రించవచ్చని సూచించారు. భూసార పరీక్ష కోసం మట్టి నమూనాలను ఎలా సేకరించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో రజని, సర్పంచ్ గురవయ్య పాల్గొన్నారు.