కోదాడ మండలం గుడిబండలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యూనిట్ కార్యాలయాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్ వాణి బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, అద్దె భవనాల మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత భవనాలతో సమస్యలు తగ్గుతాయని ఆమె తెలిపారు. కోదాడ యూనిట్‌లో సేవలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీవో జయప్రకాష్ రెడ్డి, ఎంవీఐ జిలాని షేక్, ఏఎంవీఐ చరణ్, సర్పంచ్ నాగయ్య, నాయకులు పాల్గొన్నారు.