త్రిపురవరం: నవయుగ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం

1104చూసినవారు
త్రిపురవరం: నవయుగ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం
అనంతగిరి మండలం త్రిపురవరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం నవయుగ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం గణనాథుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం అన్నదానం ప్రారంభమైంది. కాలనీవాసులతో పాటు గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్