అనంతగిరి మండలం త్రిపురవరం శ్రీ కోదండరామస్వామి దేవాలయ పూజారి, కమిటీ ఆధ్వర్యంలో మహిళలచే శ్రీ గోదాదేవి అమ్మవారికి సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై, తమ మాంగల్యబలం, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని వేడుకున్నారు. పూజారుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కుంకుమార్చనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.