విద్యారంగ సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్

6చూసినవారు
విద్యారంగ సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్
గురువారం కోదాడ హై స్కూల్ లో జరిగిన డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో తమ సంఘం అగ్రస్థానంలో ఉందని అన్నారు. సెలవులు వినియోగించుకోకుండా అంకిత భావంతో పనిచేసిన యుటిఎఫ్ బాధ్యుడు శ్రీనివాసచారిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ తల్లాడ శ్రీనివాసరావు చేత నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించబడింది. కార్యక్రమంలో డివిజన్ బాధ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్