నడిగూడెం మండల కేంద్రంలో ఆర్యవైశ్య కుల దైవం వాసవి మాత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయంలో ఆర్య వైశ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వాసవి మాతకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య పెద్దలు భవిష్యత్తు వెంకటరత్నం, చలంచర్ల సత్యనారాయణ, మోహన్ రావు, సూర్యప్రకాష్, చెన్నూరి బాబు, కొండా వెంకన్న, భువనగిరి ఉపేందర్, మొరి శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.