కోదాడ కాంగ్రెస్ నాయకులచే వేనేపల్లి చందర్రావుకు ఘన సన్మానం

3చూసినవారు
కోదాడ కాంగ్రెస్ నాయకులచే వేనేపల్లి చందర్రావుకు ఘన సన్మానం
బుధవారం నాడు కోదాడ మాజీ శాసనసభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేనేపల్లి చందర్రావు గారి 86వ జన్మదినం సందర్భంగా అనంతగిరి మండల కేంద్రంలోని శ్రీ రఘునాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, ఎంఎస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు పాల్గొన్నారు. నాగిరెడ్డి మాట్లాడుతూ చందర్రావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్