తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కోదాడకు చెందిన అనుబత్తుల వేణు నియమితులయ్యారు. చౌటుప్పల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సహకార సభ్యుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఐక్యత కోసం కొత్త కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.