కోదాడ మున్సిపాలిటీలోని లక్ష్మీపురం ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామినేని రజిని నరేష్ వినూత్నంగా డప్పు కొడుతూ ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని, లేదంటే ఓటుకు విలువ ఉండదని అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేశామని తెలిపారు.