ప్రజల సమస్యల పరిష్కారానికే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం వార్డు సభలను నిర్వహిస్తుందని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు తెలిపారు. గురువారం కోదాడలోని తమ్మర జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన వార్డు సభలో ఆమె మాట్లాడుతూ, సంబంధిత శాఖల అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.