గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ, మునగాల మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీఓ రమేష్ దీనదయాల్ మాట్లాడుతూ సత్యం, అహింస, సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.