ప్రతిభావంతులైన విద్యార్థుల చదువులకు అండగా ఉంటాం

0చూసినవారు
ప్రతిభావంతులైన విద్యార్థుల చదువులకు అండగా ఉంటాం
కోదాడ పట్టణంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు షేక్ నిజాం మాట్లాడుతూ, విద్యతోనే సామాజిక, ఆర్థిక, సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని అన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన మైనార్టీ, ఇతర సామాజిక వర్గాల విద్యార్థులను సన్మానించి, అభినందించారు. ప్రతిభావంతులైన విద్యార్థుల చదువులకు తాము అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా బ్లూమ్ స్కూల్ చైర్మన్ ఎం. డి. షేర్ అలీ, మాజీ గ్రంథాలయ చైర్మన్ షేక్ రహీం, మాజీ ఎంపీటీసీ అఫ్జల్, అహ్మద్ మౌలానా, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్