కిట్స్ లో డిప్లమా ఫైనల్ విద్యార్థుల స్వాగత, వీడ్కోలు

5చూసినవారు
కిట్స్ లో డిప్లమా ఫైనల్ విద్యార్థుల స్వాగత, వీడ్కోలు
కోదాడ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం డిప్లమా ఫైనల్ విద్యార్థుల స్వాగత, వీడ్కోలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థినులు, జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. కళాశాల స్థాపించిన నాటి నుండి వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యలు పూర్తిచేసి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. గాంధీ, డైరెక్టర్ నాగార్జున రావు, హెచ్ ఓడి లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్