కోదాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా భారీ ర్యాలీ జరిగింది. వందలాది మంది కార్మికులు ఎర్ర జెండాలు పట్టుకొని, డప్పు కళాకారులు, కోలాట బృందాల నృత్యాల మధ్య ఖమ్మం క్రాస్ రోడ్ నుండి రాజీవ్ చౌక్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికుల నినాదాలతో కోదాడ దద్దరిల్లింది, ఎర్ర జెండాల రెపరెపలతో పట్టణం ఎరుపెక్కింది.