యువత క్రీడల్లో రాణించాలి.. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి

0చూసినవారు
యువత క్రీడల్లో రాణించాలి.. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో కానిస్టేబుల్ యలమర్తి అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగిన టీపీఎల్ లీగ్ క్రికెట్ సీజన్-2 టోర్నమెంట్‌ను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలకమని ఆయన అన్నారు. యువత క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి ఉమామహేశ్వరి, పులి సులోచనరావు, యలమర్తి రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్