
కోదాడ: భక్తులతో పోటెత్తిన శివాలయాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పౌర్ణమి రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. కోదాడ డివిజన్ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు పుణ్యస్నానాల కోసం సరిహద్దు నదుల వద్దకు భారీగా తరలివెళ్లారు. స్థానిక ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే దీపారాధనలు, అర్చనలు ఘనంగా జరిగాయి.







































